TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలేశుని సర్వదర్శనానికి 24 గంటల సమయం

Published on: Sat Aug 17, 2024 9:48AM

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వారాంతం కావడంతో కలియుగ వేంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శనివారం (ఆగస్టు17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.

భక్తుల క్యూలైన్ శిలా తోరణం వరకూ సాగింది.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక  శుక్రవారం (ఆగస్టు 16) శ్రీవారిని 62 వేల 625 మంది దర్శించుకున్నారు.

వారిలో 34 వేల 462 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 63 లక్షల రూపాయలు వచ్చింది.