భక్తులతో పోటెత్తిన తిరుమల కొండ
Published on: Fri Aug 16, 2024 9:36AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవు దినాలు కావడంతో భక్తులు తిరుమల కొండకు పోటెత్తారు. శుక్రవారం ఉదయం ( ఆగస్టు 16) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా పడుతోంది. శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా సెలవు దినం కావడంతో భక్తుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది.
కాగా గురువారం (ఆగస్టు 15) శ్రీవారిని మొత్తం 76 వేల 695 మంది దర్శించుకున్నారు. వారిలో 34 వేల 395 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 90 లక్షల రూపాయలు వచ్చింది.


