శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.5.26 కోట్లు
Published on: Thu Aug 15, 2024 9:33AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం ( ఆగస్టు 14) శ్రీవారిని మొత్తం 72 వేల 967 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 321 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 5 కోట్ల 26 లక్షల రూపాయలు వచ్చింది. ఇక గురువారం (ఆగస్టు 15) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.


