TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published on: Wed Aug 14, 2024 9:02AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారం మధ్యలోనే  శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు పోటెత్తారు. బుధవారం (ఆగస్టు 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.  గురువారం పంద్రాగస్ట్ సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇలా ఉండగా మంగళవారం శ్రీవారిని మొత్తం 73వేల 246 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 133 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 35లక్షల రూపాయలు వచ్చింది.