TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Tue Aug 13, 2024 10:39AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (ఆగస్టు 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 24 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం (ఆగస్టు 12) శ్రీవారిని మొత్తం 70 వేల 728 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 29 వేల 611 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది.