TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Published on: Mon Aug 12, 2024 10:11AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (ఆగస్టు 12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం (ఆగస్టు 11) శ్రీవారిని మొత్తం 86వేల 604 మంది దర్శించుకున్నారు.

వారిలో 31 వేల 536 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 89 లక్షల రూపాయలు వచ్చింది.