TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Published on: Sun Aug 11, 2024 8:04AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడం, వరుసగా రెండో శనివారం, ఆదివారం సెలవుదినాలు కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు.

శనివారం (ఆగస్టు 10) శ్రీవారిని మొత్తం 79 వేల 313 మంది దర్శించుకున్నారు. వారిలో 36 వేల 344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 65 లక్షల రూపాయలు వచ్చింది.

ఇక ఆదివారం (ఆగస్టు 11) తిరుమల కోండ భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.