TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Tue Aug 6, 2024 9:31AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (ఆగస్టు 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా  క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.

ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. కాగా సోమవారం (ఆగస్టు 5) శ్రీవారిని మొత్తం 63 వేల 95 మంది దర్శించుకున్నారు.

వారిలో 23 వేల 127 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 72 లక్షల రూపాయలు వచ్చింది.