TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Fri Aug 2, 2024 9:58AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత రెండు రోజులుగా సాధారణంగా ఉన్న భక్తుల ఇప్పుడు స్వల్పంగా పెరిగింది. శుక్రవారం (ఆగస్టు 2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం (ఆగస్టు 1) శ్రీవారిని మొత్తం 61 వేల 465 మంది దర్శించుకున్నారు.

వారిలో 21. 206 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది.