తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Thu Aug 1, 2024 9:36AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (ఆగస్టు 1) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం (జులై31) శ్రీవారిని 67 వేల 916 మంది దర్శించుకున్నారు.
వారిలో 23 వేల 10 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 93 లక్షల రూపాయలు వచ్చాయి.


