తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Tue Jul 30, 2024 9:37AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 12 గంటల సమయం పడుతోంది.
మంగళవారం (జులై30) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. సోమవారం (జులై 29) శ్రీవారిని మొత్తం 65 వేల 874 మంది దర్శించుకున్నారు.
వారిలో 23 వేల 782 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 48 లక్షల రూపాయలు వచ్చింది.


