తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.25 కోట్లు
Published on: Sun Jul 21, 2024 8:37AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (జులై21) ఉదయం శ్రీవారిదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం (జులై 20) శ్రీవారిని మొత్తం 83 వేల 538 మంది దర్శించుకున్నారు.
వారిలో 30 వేల 267 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 25 లక్షల రూపాయలు వచ్చింది.


