తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Sat Jul 20, 2024 9:51AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. శనివారం (జులై 20) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తలకు శ్రీవారి సర్వదర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పడుతోంది. శుక్రవారం (జులై19) శ్రీవారిని మొత్తం 65వేల134 మంది భక్తులు దర్శించుకున్నారు.
వారిలో 26వేల100 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 27 లక్షల రూపాయలు వచ్చింది.


