తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Wed Jul 17, 2024 9:10AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (జులై 17)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 10 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (జులై 16) శ్రీవారిని మొత్తం 71 వేల 509 మంది దర్శించుకున్నారు.
వారిలో 26 వేల 128 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 15 లక్షల రూపాయలు వచ్చింది.


