తిరుమలేశుని దర్శనానికి 18 గంటలు
Published on: Tue Jul 16, 2024 8:53AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (జులై 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. సోమవారం (జులై 15) శ్రీవారిని మొత్తం 75వేల 54 మంది దర్శించుకున్నారు.
వారిలో 26వేల 239 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 72 లక్షల రూపాయలు వచ్చింది.


