TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Mon Jul 15, 2024 9:12AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై 15) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 23 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (జులై 14) శ్రీవారిని మొత్తం 84వేల 797 మంది దర్శించుకున్నారు.

వారిలో 29 వేల 497 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 98 లక్షల రూపాయలు వచ్చింది.