తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Sun Jul 14, 2024 9:05AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. శనివారం (జులై 13) శ్రావారిని మొత్తం 75 వేల 916 మంది దర్శించుకున్నారు.
వారిలో 42 వేల 920 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుడీ కానుకల ఆదాయం 3 కోట్ల 87 లక్షల రూపాయలు వచ్చింది. ఇక ఆదివారం (జులై 14) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.
భక్తుల క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.


