TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు

Published on: Sat Jul 13, 2024 9:21AM

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. తిరుమలేశుని దర్శనానికి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. శనివారం (జులై 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కాంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.

భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. ఇక శుక్రవారం (జులై 12) శ్రీవారిని మొత్తం 63వేల 493 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 676 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హండీ ఆదాయం 4 కోట్ల 69లక్షల రూపాయలు వచ్చింద. వారంతం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఆదివారం (జులై 14)కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది.