తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు
Published on: Fri Jul 12, 2024 8:12AM
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. శుక్రవారం (జులై12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.
భక్తుల క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇ
క సోమవారం శ్రీవారిని మొత్తం 65 వేల 392 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 15 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 23 లక్షల రూపాయలు వచ్చింది.


