తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Wed Jul 10, 2024 9:16AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (జులై 10) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం (జులై 9) శ్రీవారిని మొత్తం 63 వేల 619 మంది దర్శించుకున్నారు.
వారిలో 28వేల 672 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 78 లక్షల రూపాయలు వచ్చింది.


