శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Wed Jun 26, 2024 8:09AM
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. బుధవారం (జూన్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 16 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (జూన్ 25) శ్రీవారిని మొత్తం 71 వేల 824 మంది దర్శించుకున్నారు.
వారిలో 28వేల 462 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల ఒక లక్ష రూపాయలు వచ్చింది.


