తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Thu Jun 20, 2024 9:07AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (జూన్ 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహచ్ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం తిరుమల శ్రీవారిని మొత్తం 79వేల584 మంది దర్శించుకున్నారు.
వారిలో 31 వేల 848 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 18లక్షల రూపాయలు వచ్చింది.


