శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్ల 14లక్షలు
Published on: Tue Dec 19, 2023 8:36AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (డిసెంబర్ 19)ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం (డిసెంబర్ 17) శ్రీవారిని 61వేల 499 మంది దర్శించుకున్నారు.
వీరిలో 24వేల 789 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 14లక్షల రూపాయలు వచ్చింది.


