తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
Published on: Tue Dec 12, 2023 8:47AM
తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం (డిసెంబర్ 11)తో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. మంగళవారం (డిసెంబర్ 12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం (డిసెంబర్ 11) శ్రీవారిని 64వేల 882 మంది దర్శించుకున్నారు.
వారిలో 24వేల 900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 5 కోట్ల 28లక్షల రూపాయలు వచ్చింది.


