TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణం

Published on: Fri Dec 1, 2023 9:19AM

 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (డిసెంబర్ 1) శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక గురువారం(నవంబర్ 30) శ్రీవారిని 58వేల 278 మంది భక్తులు సందర్శించుకున్నారు.

వారిలో 17,220 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53కోట్లు వచ్చింది. కాగా నవంబర్ మాసం మొత్తం కలిపి శ్రీవారి హుండీ ద్వారా భక్తులు 108 కోట్ల రూపాయలు కానుకగా సమర్పించారు.