TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Mon Nov 27, 2023 6:14AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (నవంబర్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 13 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం(నవంబర్ 26) శ్రీవారిని 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 19 వేల 500 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకలు 3 కోట్ల 11 లక్షల రూపాయలు వచ్చింది.