తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Sat Nov 25, 2023 8:17AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం (నవంబర్ 25)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో తొమ్మిది కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం (నవంబర్ 24)శ్రీవారిని 74వేల 843 మంది దర్శించుకున్నారు.
వారిలో 23వేల 776 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 40లక్షల రూపాయలు వచ్చింది.


