తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Thu Nov 23, 2023 6:30AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (నవంబర్ 23) టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
ఇక శ్రీవారి దర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. బుధవారం(నవంబర్ 22) శ్రీవారిని 65వేల 891 మంది దర్శించుకున్నారు.
వీరిలో 22 వేల 896 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల నాలుగు లక్షల రూపాయలు వచ్చింది.


