శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు
Published on: Sat Aug 12, 2023 7:15AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం(ఆగస్టు 12) శ్రీవారిని 72 వేల 158 మంది దర్శించుకున్నారు. 30 వేల 735 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల 8 లక్షలు వచ్చింది. ఇక శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 23 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెట్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.


