శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Sat Jul 8, 2023 7:01AM
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం శ్రీవారికి 69వేల 483 మంది దర్శించుకున్నారు.
32 వేల 459 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3.58 కోట్ల రూపాయలు వచ్చింది. శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో మొత్తం కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.
భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.


