తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Published on: Fri Jun 30, 2023 9:38AM
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.
గురువారం శ్రీవారిని 63 వేల 005 మంది భక్తులు దర్శించుకున్నారు. 34 వేల 127 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్ల రూపాయలు వచ్చింది.
ఇక శుక్రవారం ఉదయం అయితే శ్రీవారి భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి, క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.


