తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటలు
Published on: Thu Jun 22, 2023 12:16PM
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులకు 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
గురువారం (జూన్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. కాగా బుధవారం శ్రీవారికి 77 వేల 120 మంది భక్తులు దర్శించుకున్నారు.
34 వేల 463 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయలు వచ్చింది.


