శ్రీవారి హుండీ కానుకలు 3.50 కోట్లు
Published on: Wed May 10, 2023 6:57AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. నిన్న అంటే మంగళవారం (మే 9) శ్రీవారిని 65వేల 237 మంది భక్తులు దర్శించుకున్నారు.
22 వేల 926 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు 3.50 కోట్ల రూపాయల కానుకలు సమర్పించారు.
ఇక ఈ ఉదయం అంటే బుధవావారం (మే 10) న భక్తులు కంపార్ట్ మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి పది గంటల సమయం పడుతుంది.


