తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Published on: Sun Dec 17, 2023 7:15AM
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం(డిసెంబర్ 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ నారాయణ గిరి గార్డెన్స్ వరకూ సాగింది.
కాగా శనివారం (డిసెంబర్ 16) శ్రీవారిని 59వేల 734 మంది దర్శించుకున్నారు.
వారిలో 30వేల654 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 52 లక్షల రూపాయలు వచ్చింది.


