శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Fri Dec 15, 2023 8:13AM
తి
రుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అధికంగా ఉంది. శుక్రవారం (డిసెంబర్ 15) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ టీబీసీ వరకూ వచ్చింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (డిసెంబర్ 14) శ్రీవారినిక 56వేల 49 మంది దర్శించుకున్నారు.
వారిలో 26వేల 748 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 97లక్షల రూపాయలు వచ్చింది.


