TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీశైలంలో భక్తుల రద్దీ.. ముక్కంటి దర్శనానికి 3 గంటల సమయం

Published on: Mon Oct 27, 2025 9:34AM

కార్తీక సోమవారం సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది.  కార్తీక సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి దర్శనానికి భక్తులు పోటెత్తారు.   శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి   దర్శనానికి  మూడు గంటలకు పైగా సమయం పడుతోంది.  సోమవారం (అక్టోబర్ 27) తెల్లవారు జామునుంరే భక్తులు  పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.

కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఇప్పటికే శని, అది, సోమవారాలలో స్పర్శ దర్శనం, సామూహిక, గర్భాలయా అభిషేకాలు మాసంతం నిలుపుదల చేశారు. అలానే మంగళవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు మూడు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఒక సోమవారం (అక్టోబర్ 27) భక్తుల రద్దీ దృష్ట్యా  శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు   తెలిపారు. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.