తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Fri Sep 8, 2023 9:53AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారాంతం కావడంతో భక్తులు తిరుమల వెంకన్న దర్శనం కోసం పోటెత్తుతున్నారు. గురువారం శ్రీవారిని 58వేల 855 మంది భక్తులు దర్శించుకున్నారు.
వారిలో 29వేల014 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 65లక్షల రూపాయలు వచ్చింది.
ఇక శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ బాటగంగమ్మ ఆలయం వరకూ వచ్చింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.


