TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sun Jul 13, 2025 10:56AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (జులై 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్తట్ మెంట్లన్నీ నిండియోయాయి. భక్తుల క్యూలైన్ ఆక్టోపస్ సర్కిల్ వరకూ సాగింది. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.

క్యూలేన్లలో వేచి ఉన్న భక్తులకు టిటిడీ యాజమాన్యం అన్న, జల ప్రసాదాలు పంపిణీ చేస్తున్నది. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక శనివారం ‘జులై 12’ శ్రీవారిని మొత్తం 92 వేల 221 మంది దర్శించుకున్నారు. వారిలో 42 వేల 260 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 51 లక్షల రూపాయలు వచ్చింది.