TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Tue Apr 29, 2025 8:20AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (ఏప్రిల్ 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ కొనసాగుతున్నది. టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సఃర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

ఇక సోమవారం (ఏప్రిల్ 28) శ్రీవారిని మొత్తం 65 వేల 904 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24 వేల 487 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 53 లక్షల రూపాయలు వచ్చింది.