TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారం

Published on: Tue Apr 22, 2025 7:05AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (ఏప్రిల్ 22)ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

ఇక సోమవారం (ఏప్రిల్ 21)శ్రీవారిని మొత్తం 72 వేల 937 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 157 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 79 లక్షల రూపాయలు వచ్చింది.