TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Tue Sep 12, 2023 11:16AM

తిరుమలలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం శ్రీవారిని 66వేల 199 మంది దర్శించుకున్నారు. వారిలో 29వేల 351 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 4.17 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.