తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Wed Oct 8, 2025 8:26AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి తరలి వస్తుంటారు. బుథవారం (అక్టోబర్ 8) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది.
శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వెైకుంఠం కాంప్లెక్స్ లోని కాంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (అక్టోబర్ 7) శ్రీవారిని మొత్తం 71,634 మంది దర్శించున్నారు. వారిలో 24,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 74 లక్షల రూపాయలు వచ్చింది.


