TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Published on: Thu Oct 2, 2025 9:03AM

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో తిరమల భక్త జన సంద్రంగా మారింది.

గురువారం (అక్టోబర్ 2) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలా తోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (అక్టోబర్ 1) శ్రీవారిని మొత్తం 72 వేల 247 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 738 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 71 లక్షల రూపాయలు వచ్చింది.