తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు
Published on: Fri Sep 26, 2025 7:34AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం (సెప్టెంబర్ 26) ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (సెప్టెంబర్ 25) స్వామి వారిని మొత్తం 67 వేల 388 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 998 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం కోటీ 74 లక్షల రూపాయలు వచ్చింది.


