తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Fri May 5, 2023 9:22AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (మే 4) తిరుమల శ్రీవారిని 64వేల 707 మంది భక్తులు దర్శించుకున్నారు.
28, 676 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా శ్రీవారి హుండీ ఆదాయం మూడు కోట్ల 98లక్షల రూపాయలు.
యిక శుక్రవారం ఉదయం నుంచీ శ్రీవారి దర్శనానికి భక్తులు 13 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.


