TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Wed May 3, 2023 9:08AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ఈ ఉదయానికే శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి.

 టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కాగా, మంగళవారం శ్రీవారిని 75,789 మంది భక్తులు   దర్శించుకుకున్నారు.  

27,684 మంది భక్తులు  తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు.