తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Sat Oct 21, 2023 9:57AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 8 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని 69వేల 821 మంది దర్శించుకున్నారు.
వారిలో 26వేల 098 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 27లక్షల రూపాయలు వచ్చింది.


