TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ నేత దేవినేని కుమారుడి పెళ్లి వేడుకులకు హాజరైన సీఎం రేవంత్

Published on: Wed Apr 30, 2025 1:38PM

 

తెలుగుదేశం పార్టీ  సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి పెళ్లి వేడుకులు ఘనంగా నిర్వహించారు. నగర శివారు కంకిపాడులో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. 

నూతన వధూవరులు నిహార్‌, సాయి నర్మదలను వారు ఆశీర్వదించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విజయవాడ చేరుకున్న రేవంత్‌రెడ్డికి హెలిప్యాడ్‌ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి స్వాగతం పలికారు. రేవంత్‌, మంత్రి నారా లోకేశ్‌ కలిసి వివాహ వేడుక వద్దకు వచ్చారు. మరోవైపు  పెళ్లి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండడంతో తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల సమయం మార్పు జరిగింది.షెడ్యూల్ ప్రకారం ఒంటి గంటకు విడుదల కావాల్సి ఉండగా ఫలితాలు మధ్యాహ్నం 2.15కి  సీఎం రేవంత్‌ రెడ్డిఫలితాలు విడుదల చేయనున్నరు