దేవినేని ఆమ‌ర‌ణ దీక్ష

 

15రోజుల గ‌డుస్తున్న సమైక్యాంద్ర కోసం జ‌రుగుతున్న ఉద్యమాలు త‌గ్గక పోగా మ‌రింత తీవ్రమ‌వుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేత‌లు నిర‌హార దీక్షలు చేస్తుండగా ఇప్పుడు ఈ మ‌రో నాయ‌కుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించ‌డానికి రెడీ అవుతున్నారు. సమైక్యాంధ్రాకు మద్దతుగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమమహేశ్వరరావు  ఆమరణ దీక్ష చేపట్టనున్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడిన‌ రాష్ట్రం సమైక్యం కోసం స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ఆగస్టు 15న తాను ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విభ‌జ‌న విష‌యంలో అనుస‌రిస్తున్న వైఖ‌రితో పాటు రాష్ట్రాన్ని స‌మైక్యంగా ఉంచాల‌నే డిమాండ్ల‌తో ఆయ‌న నిర‌వ‌ధిక దీక్ష చేప‌డుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ విధానాల‌తో  సీమాంధ్రలో ఇప్పటికే 300 మందికి పైగా  ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆయ‌న‌ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంద్రల విష‌యంలో కాంగ్రెస్ నిర్లక్షంగా వ్యవ‌హ‌రిస్తుంద‌న్న ఆయ‌న సోనియా రాహుల్‌ని ప్రదానిని చేయ‌డానికే విభ‌జ‌న నిర్ణయం తీసుకుంద‌ని విమ‌ర్శించారు.