TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉగ్రవాదులకు బలయిన బ్రిటిష్ పౌరుడు

Published on: Sun Sep 14, 2014 12:17PM

 

 

 

బిన్ లాడెన్ మట్టుబెట్టి తాలిబన్ ఉగ్రవాదులకు అమెరికా కళ్ళెం వేసిందని అందరూ ఊపిరి తీసుకొంటుంటే కొత్తగా ఐ.యస్.ఐ.యస్.అనే మరో ఉగ్రవాద సంస్థ సిరియాలో పుట్టుకొచ్చింది. కొద్ది వారాల క్రితం ఇద్దరు అమెరికన్లను అత్యంత కిరాతకంగా గొంతులు కోసి ఆ వీడియోను యూ ట్యూబ్ కి ఎక్కించిన ఆ సంస్థ నిన్న (శనివారం) తమ వద్ద బందీగా ఉన్న డేవిడ్ హెయిన్స్ అనే బ్రిటిష్ దేశస్థుడిని అదేవిధంగా చంపి ఆ వీడియోను కూడా విడుదల చేసింది. బ్రిటన్ దేశం తమపై బాంబుళ వర్షం కురిపిస్తున్న అమెరికాతో చేతులు కలిపినందుకు ఆ దేశానికి హెచ్చరికగా డేవిడ్ హెయిన్స్ కు ఈ శిక్ష విధిస్తున్నామని సదరు ఉగ్రవాద సంస్థ తను జారీ చేసిన వీడియోలో హెచ్చరించింది.